chitika

Search This Blog

chitika

chitika

Thursday, August 28, 2014

THE GIST OF BHAGAWADH GEETHA


HAPPY GANESH CHATURTHI FESTIVAL


THE MEANING OF GANAPATHI 

G - GANAPATHI - LORD OF ALL GODS
A - ALAMPATA - INFINITE LORD
N - NIDEESHWARAM - BESTOWER OF TREASURES AND RICHES
E - ESHANPUTRA - SON OF LORD SHIVA
S - SIDDHIDATA - GIVER OF SUCCESS
H - HARIDA - GOLDEN COLOURED
A - AVIGHNA - REMOVER OF ALL DIFFICULTIES AND OBSTACLE



WISHING YOU HAPPY GANESH CHATURTHI


WISHING YOU HAPPY GANESH CHATURTHI

MAY GANESHA BLESS GOOD LUCK
TO
YOU AND ALL YOUR FAMILY MEMBERS

LORD VINAYAKA - THE REMOVER OF ALL OBSTACLES


BEAUTY OF LORD GANESHA IS THAT IRRESPECTIVE OF
CASTE EVERYBODY WORSHIPS HIM.
HE IS THE VIGHNA VINSHAKA -
THE REMOVER OF ALL OBSTACLES.

HE IS ALSO THE PRADATA (GIVER) OF SIDDHI (ATTAINMENT)
AND BUDDHI (INTELLIGENCE)
WITHOUT WHICH WE CANNOT LEAD OUR LIVES.

GANESH SYMBOLISM - DETAILED CHART OF LORD VINAYAKA


VINAKAYA CHAVITHI FESTIVAL ARTICLE - THE BIRTH STORY OF LORD VIGNESWARA / GANESHA / VINAYAKA IN TELUGU


వినాయకుని జననం, ఏనుగు తల

వినాయకుని జననం గూర్చి సర్వసాధారణమైన కథ, వినాయక చవితి వ్రతంలో చదివేది: గజాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు శివుని తన శరీరములో దాచుకొన్నాడు. కాని విష్ణువుకు ఇచ్చిన మాట ప్రకారం, తన శిరస్సును లోకపూజ్యము చేయమని కోరి, మరణించాడు. కైలాసములో శివుని రాకకు ఎదురు చూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి, ప్రాణము పోసింది. తను స్నానమునకు పోవునపుడు ఆ బాలుని వాకిలివద్ద కావలి ఉంచింది. ఆ బాలుడు ద్వారముదగ్గర శివుని అడ్డుకొన్నాడు. కోపించి శివుడు బాలుని తల తెగవేశాడు. విషయము తెలిసికొని పార్వతి హతాశురాలైంది. ఆప్పుడు శివుడు గజాసురుని శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి బ్రతికించాడు. గణపతిగా నియమించాడు.

బ్రహ్మవైవర్త పురాణములోని కథ: శివుని ఉపదేశము ప్రకారము పార్వతి విష్ణువును పూజించి, పుణ్యకవ్రతము మాచరించి కొడుకును కన్నది. ఆ బాలుని జన్మము వేడుకలలో బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఆశీర్వదించారు. కాని శనీశ్వరుడు మాత్రం ఆ బాలుని వైపు చూడలేదు, తన దృష్టి వల్ల హాని జరుగుతుందనే భయంతో. కాని పార్వతి బలవంతంపై బాలుని ముఖం చూడక తప్పలేదు. అప్పుడు ఆ బిడ్డ తల పగిలిపోయింది. దేవతలంతా చింతితులు కాగా విష్ణువు పుష్పభద్రానదీ తీరంనుంచి ఒక గున్న ఏనుగు తల తెచ్చి, అతికించి, ఆ బాలును పునరుజ్జీవితుని చేశాడు.

మరొక కథ ప్రకారం (వరాహ పురాణం) - శివుని నవ్వునుండి వినాయకుడు జన్మించాడు. అయితే వినాయకుని అందం చాలా ఎక్కువ కావడం వలన (దిష్టి తగులకుండా?) శివుడు అతనికి ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.

* వినాయకుని కుటుంబం

వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడని సాధారణ ప్రవచనం. కాని ఇతని జన్మ గురించి పురాణాలలో గాధా భేదాలున్నాయి. ఇతనిని శివుడు సృష్టించాడని , ఇతనికి తన వంటి నలుగుతో పార్వతి ప్రాణం పోసిందని, పుణ్యక వ్రతం ఆచరించి పార్వతీదేవి ఈ బిడ్డను కన్నదని, పార్వతీ పరమేశ్వరులు వినాయకుని సృష్టించారని, స్వయంభువువైన ఇతనిని పార్వతీపరమేశ్వరులు కనుగొన్నారని ఇలా అనేక గాధలున్నాయి.

వినాయకుని తమ్ముడు స్కందుడు (మురుగన్, కార్తికేయుడు, కుమారస్వామి). వీరి గురించి కూడా కథలలో వైవిధ్యం ఉంది. సాధారణంగా ఉత్తర భారతదేశంలోని కథల ప్రకారం కుమారస్వామి పెద్దవాడు. దక్షిణ భారతదేశంలోని కథల ప్రకారం వినాయకుడు పెద్దవాడు. ఉత్తర భారతదేశంలో క్రీ.పూ. 500 నుండి క్రీ.శ. 600 వరకు స్కందుని పూజ (వీర పూజ) అధికంగా ఉండేది కాని క్రమంగా తగ్గింది. వినాయకుని పూజకు ప్రాముఖ్యత పెరిగింది. (ఇద్దరు సోదరుల మధ్య అధిపత్యపు పోటీ గురించి కూడా ఒక కథ ఉంది). ఇది కొన్ని జాతుల మధ్య పోటీని సూచించవచ్చును.

వినాయకుడు బ్రహ్మచారి అని కొన్ని కథలలోను, అతనికి సిద్ధి, బుద్ధి అనే భార్యలున్నారని కొన్ని కథలలోను ఉంది. దక్షిణ భారత దేశంలోను, ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలోను వినాయకుని బ్రహ్మచారిగా కొలుస్తుంటారు. బుద్ధి, సిద్ధి, వృద్ధి అనే మూడు భాగ్యాలను వినాయకుడు కలిగిస్తాడు గనుక ఈ గుణాలను మూర్తీభవించిన దేవతా స్వరూపులుగా భావించి వినాయకునికి భార్యలుగా ఆపాదించారని ఒక అభిప్రాయం. ఇంకా కొన్ని బొమ్మలలో వినాయకుని చదువుల తల్లి సరస్వతితోను, సిరిసంపదల తల్లి లక్ష్మీదేవితోను కలిపి చిత్రీకరిస్తారు. బెంగాల్ ప్రాంతంలో Kala Bo అరటిచెట్టుతో పాటు వినాయకుని చూపే సంప్రదాయం ఉంది.

శివ పురాణం ప్రకారం వినాయకునికి ఇద్దరు కుమారులు - క్షేమము, లాభము. ఉత్తర భారతంలో వీరిని శూభము, లాభము అని వ్యవహరిస్తారు. 1975లో వెలువడిన హిందీ సినిమా జై సంతోషీ మాలో వినాయకునికి వృద్ధి, సిద్ధి అనే వారితో వివాహం జరిగినట్లు, వారికి సంతోషీ మాత అనే కుమార్తె కలిగినట్లు చూపారు. ఈ విషయం పురాణాలలో లభించడంలేదు కాని సంతోషీమాత కథ దేశంలో బాగా ప్రసిద్ధమైనది. వినాయకుడు లోకప్రియమైన దేవునిగా ఎలా అభివృద్ధి చెందాడో తెలుసుకోవడానికి ఈ కథ ఉపయోగపడుతుందని అనితా రాయ్ తపన్ మరియు లారెన్స్ కోహెన్ అభిప్రాయపడ్డారు.

* గణాధిపత్యం, చంద్రునినవ్వు, పార్వతిశాపం

(ఈ కథ వినాయక వ్రత కల్ప విధానము వ్యాసంలో వివరంగా ఇవ్వబడినది) గణాధిపతి స్థానానికి వినాయకుడూ, కుమారస్వామీ పోటీ పడ్డారు. శివుడు ఇరువురికీ పోటీ పెట్టినాడు- "మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చెసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుంది". కుమార స్వామి నెమలి వాహనంపై వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. వినాయకుడు నారాయణ మంత్రము జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయుణుని ఆధీనాలు. అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందె వినాయకుడు ప్రత్యక్షము కాజొచ్చాడు. వినాయకునికే ఆధిపత్యము లభించినది.

గణాధిపతియైన వినాయకుడు లోకములపూజలు అందుకొని, సుష్టుగా భోజనం చేసి, కైలాసమునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోయాడు. కాని బొజ్జ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే, అదిచూసి చంద్రుడు పకపక నవ్వాడు. ఆ నవ్వుకు (దృష్టి దోషానికి) వినాయకుడి పొట్ట పగిలిపోయింది. కోపించిన పార్వతి "నిన్ను చూచినవారు నీలాపనిందలకు గురియగుదురు గాక" అని శపించినది. ఫలితముగా లోకమునకు చంద్రుడు నింద్యుడయినాదు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు.

లోకుల ప్రార్ధనలు మన్నించిన పార్వతి 'బాధ్రపద శుద్ధ చవితి' నాడు (చంద్రుడు నవ్విన నాడు) మాత్రమే ఈ శాపము వర్తిస్తుందని శాప ప్రభావాన్ని సడలించింది. ఆ ఒక్కరోజు లోకులు జాగ్రత్త పడసాగారు. ద్వాపర యుగంలో కృష్ణుడు పొరపాటున చంద్రుని చూచినందున ఆయనకు కూడా శ్యమంతకమణి అపహరించాడనే అపనింద అంటుకుంది. శ్రమించి కృష్ణుడు అసలు విషయాన్ని ఋజువు చేసుకొన్నాడు. కాని శక్తి హీనులైన సామాన్యులకు ఇది ఎలా సాధ్యం? ప్రజల విన్నపాన్ని మన్నించి కృష్ణుడు "బాధ్రపద శుద్ధ చవితి" నాడు వినాయకుని పూజించి, ఈ కథ విని, అక్షతలు తలపై ధరిస్తే ఈ శాపదోషం అంటదని ఉపాయాన్ని అనుగ్రహించాడు

* సిద్ధి, బుద్ధి

వినాయకునకు సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలు. కనుకనే వినాయకుడు ఉన్నచోట సకల కార్యాలూ సిద్ధిస్తాయి. జ్ఙానం వికసిస్తుంది. ఇక కొరతేమున్నది. అందువలన ఏ పనైనా - పూజ కాని, పెండ్లి కాని, గృహప్రవేశం గాని, ప్రారంభోత్సవం గాని, రచనారంభం గాని, పరీక్ష గాని, ఉద్యోగం గాని - వినాయకుని పూజతోనే మొదలవుతుంది. ముఖ్యంగా జ్యోతిష్యులకూ, రచయితలకూ వినాయకుడు నిత్యారాధ్య దేవుడు.
కాకిరూపంలో గణపతి.

HAPPY GANESH CHATHURDHI FESTIVAL ON 29-08-2014




వినాయక చవితి శుభాకాంక్షలు

HAPPY VINAYAKA CHAVITHI FESTIVAL 29-08-2014





Friday, August 22, 2014

GNANA VIGNANA YOGAM - TELUGU PURANA SLOKAS AND ITS MEANING


శ్రీమద్భగవద్గీత - జ్ఞానవిజ్ఞానయోగము

భగవానుడు చెప్పుచున్నాడు 
మయ్యాసక్తమనాః పార్దా యోగం యుంజన్ మదాశ్రయః
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చ్రణు !

భావం :
ఓ పార్దా ! అనన్యభక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడవై యుండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై, యోగమునందు నిమగ్నుడవగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణ యుక్తుడను సర్వప్రాణులకును, ఆత్మస్వరూపుడను ఐన నన్ను సమగ్రముగా తెలుసుకొను విధము వినుము.

NO DEPRESSION IN LIFE


Life is dear to all beings, they have the right to live the same that we do. - Buddha - Gautham Buddha quotes in english


The only real failure in life is not to be true to the best one knows. - Buddha

Teach this triple truth to all… A generous heart, kind speech, and a life of service and compassion are the things which renew humanity.
Buddha.

It is better to conquer yourself than to win a thousand battles. - Buddha 

All living beings have Buddha nature and can become Buddhas.
Buddha.
 

Change is never painful, only the resistance to change is painful.
~ Buddha
 

FUTURE LESSONS QUOTATION


Vishnu's half-man half-tiger avatar, Narasimha, art by the Ravi Varma 1910's


DAUGHTER DWARAPALAKA


LORD AYYAPPA SWAMY PUJA RULES IN TELUGU




LORD SRI AYYAPPA SWAMY STUTHI - AYYAPPA PRAYERS IN TELUGU





BEAUTIFUL WOMEN LIGHTENING LAMP PAINTING


VARALAKSHMI VRATHAM FESTIVAL ARTICLE IN ENGLISH


Varalakshmi Vrata is a festival to propitiate the goddess Lakshmi, the consort of Vishnu, one of the Hindu Trinity. Varalakshmi is one who grants boons (Varam). It is an important pooja performed by many women in the states of Andhra Pradesh, Telangana, Karnataka and North Tamil Nadu. The Hindu festival going by the name 'Vara Lakshmi Vrata' is celebrated on the Second Friday or the Friday before full moon day - Poornima in the month of Śravaṇā, also called Śawan in Hindi and Aadi in Tamil which corresponds to the English months of July–August.

Varalakshmi Vrata is performed by married woman for the well being of all the family members, especially husband, to get progeny etc. It is believed that worshiping Goddess Varalakshmi on this day is equivalent to worshiping Ashtalaksmi – the eight goddesses of Wealth, Earth, Learning, Love, Fame, Peace, Pleasure, and Strength. Because of the popularity in some states of India, it is declared as an optional official holiday in India.

NEVER FORGET YOUR PAST - IT'S YOUR BEST TEACHER - BILL GATES QUOTES


Thursday, August 21, 2014

TIPS FROM PROTECTION FROM CANCER DISEASE - BLACK RICE SURELY PROTECTS FROM ATTACKING CANCER DISEASE


TWO IDIOT PROFESSORS


BEAUTIFUL MUST VISIT DRAGON TEMPLE AT THAILAND


INGUVA GIVES RELIEF FROM COLD AND COUGH TO SMALL KIDS / CHILDREN IN RAINY / WINTER SEASON


WHERE CAN WE GO TO FIND GOD IF WE CANNOT SEE HIM IN OUR OWN HEARTS AND IN EVERY LIVING BEING - SWAMI VIVEKANANDA




CLEANSE YOUR HEART DAILY WITH FORGIVENESS


BLODDY HUSBAND


BLESS US


I LIKE YOU


LIFE IS A CANVAS WHICH CANNOT BE CHANGED


WHAT IS BOOMRANG AND HOW IT WORKS ?


బూమరాంగ్ గురించి

Wednesday, August 13, 2014

ALWAYS WORK HARD FOR BETTER FUTURE


MILK AND SANDAL GOOD FOR SKIN CARE - TIPS FOR SHINY AND BEAUTIFUL SKIN


HEALTHY YALUKS ARTICLE


SCIENTIFIC REASON BEHIND WEARING SINDHOOR BY INDIAN WOMEN


నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారో తెలుసా?

హిందూ శాస్త్రాలు - ధర్మాల ప్రకారం... మానవ శరీరంలో వున్న రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా వుంటారు. అందులో భాగంగానే లలాటానికి (నుదుటకి) బ్రహ్మదేవుడు అధిపతిగా వుంటాడు. మన పురాతన గ్రంథాలు, శాస్త్రాలలో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కోవడం జరిగింది. ఆ విధంగా కొలువై వున్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు. అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటంలో (నుదుట) ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఎంతో ఆధ్యాత్మికమైన ఆచారం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... మన లలాటాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు. అందుకోసం కూడా నుదుటకు బొట్టు ధరించాల్సి వుంటుంది.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానవులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు. ప్రాచీన కాలంలో ఎంతో ఆధ్మాత్మికంగా ఆచరించే పద్ధతులను ప్రస్తుతకాలంలో వున్నవారు వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పురాతన గ్రంథాల ప్రకారం... మహిళలు తమ భర్త జీవితాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా, సుఖంగా వుండాలనే ఆశతో నుదుటనే కుంకుమను ధరించేవారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు కుంకుమను తొలగించుకునేవారు కాదు. కానీ నేటి ప్రపంచంలో వున్న మహిళలు మాత్రం ఫ్యాషన్ అన్న పేరుతో నుదుటన కుంకుమను రాసుకోవడమే మానేశారు. ఇంకొంతమంది వెటకారంగా ప్లాస్టిక్ బొట్టు బిళ్లలను పెట్టుకుంటున్నారు. ఇలా చేస్తే దాంపత్య జీవితంలో సమస్యలను ఏర్పడుతాయి... అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. కాబట్టి నుదుటన కుంకుమ ధరించడం ఎంతో అవసరం. కుంకుమను ధరించడం క్రిమి సంహారకం. దీనిని అద్దుకోవడం వల్ల జ్ఞానచక్రాన్ని పూజించనంత సమాన పుణ్యం లభిస్తుంది. అందం, అలంకరణలో కూడా కుంకుమ అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది.

ఇక చివరగా... చాలామంది నుదుటన కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే మంచి జరుగుతుందన్న సంశయంలో వుంటారు. చాలావరకు ప్రతిఒక్కరికి ఈ విషయం గురించి తెలిసి వుండదు కూడా! సాధారణంగా కుంకుమను ఏ వేలితోనైనా నుదుటన రాసుకోవచ్చు. అయితే ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసికంగా ఎంతో ప్రశాంతత, శాంతి లభిస్తుంది. నడివేలితో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది. బొటన వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది. చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోయి, భక్తీ కార్యక్రమాల్లో మనసు కేంద్రీకృతమవుతుంది. పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా ఈ విధంగా కుంకుమను ధరించడంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

DON'T PRAY GOD DIRECTLY BEFORE STANDING BEFORE STATUE - WHY


విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదు..! ఎందుకు?

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం ద్వారా మానసిక శాంతి లభిస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు. పైగా దేవుడిని ఏవైనా కోరికలు కోరినా, అవి వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు ఎక్కువగా దేవాలయాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు.

అయితే దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని నియమనిబంధనలు, శాస్త్రాలప్రకారం కొన్ని ఆచారాలను పాటించాల్సిందేనని జ్యోతిష్య నిపుణులు, పండితులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎందుకంటే.. సహజంగా ప్రతిఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు. కోరిన కోరికలు త్వరగా తీరాలనే కాంక్షతో విగ్రహానికి ముందుగా నిటారుగా నిలబడిపోతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు.

దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం లభిస్తుంది. అదెలా అంటే.. దేవతావిగ్రహాల నుంచి వెలువడే ‘‘దైవకృపా శక్తి’’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే.. ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం. కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది.

అదేవిధంగా దేవుడిని ప్రార్థించే సమయంలో రెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలి. ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా కూడా వుంటారని జ్యోతిష్యులు, పండితులు సలహాలు ఇస్తున్నారు.

WHAT IS THE MEANING AND IMPORTANCE OF PANCHAYATHANA PUJA IN HINDUISM


పంచాయతాన పూజ అంటే ఏమిటి? 

పూర్వం నుండి హిందువులు సంప్రదాయాలు, ఆచారాల ప్రచారం ప్రతిఒక్కరు తమ ఇళ్లలో పూజామందిరాలను అలంకరించుకుంటారు. ప్రస్తుతకాలంలో అయితే కొంతమంది బంగారపు విగ్రహాలను కూడా గృహాలలో అలంకరించుకుంటున్నారు. తమ ఇష్టదైవాలకు సంబంధించిన దేవతల ఫోటోలను, విగ్రహాలను అలంకరించుకుంటారు. 

అయితే హిందూ సంప్రాదాయాల ప్రకారం.. అందరూ కులాలకు అతీతంగా పూజా మందిరాలలో ఐదుగురు దేవతల (పంచదేవతలు) విగ్రహాలను వుంచి పూజించుకోవాలి. సూర్యుడు, గణేశుడు, పార్వతిదేవి, శివుడు, విష్ణువు మొదలైనవారు పంచదేవతలు. వీరిని పంచభూతాలకు ప్రతీకగా కూడా భావించుకోవచ్చు.

ప్రాచీనకాలం నుండి హిందూ ఆచారాల రీత్యా ఈ పంచదేవతలను పూజించడం ఎంతో శ్రేయస్కరమని మహాఋషులు, పండితులు తెలిపారు. అన్ని పూజా కార్యక్రమాలలో, శుభకార్యాలలో, దోష నివారణలో, కుటుంబసభ్యులు సంతోషంగా తమ జీవితాన్ని గడపడానికి ఈ దేవతలను పూజించడం ఎంతో మంచి చేకూరుతుందని ప్రగాఢ నమ్మకం.

ప్రతిరోజూ ఆచారాల ప్రకారం ఉదయాన్నే లేచి, తలంటుస్నానాలు చేసుకుని, శుభ్రమైన బట్టలను ధరించి పూజా కార్యక్రమాలను మొదలుపెట్టుకోవాలి.

ఈ ఐదుగురు దేవతల విగ్రహాలను చిన్నవిగా, తమ గుప్పిట్లో సరిపోయేంత పరిమాణంలో తయారుచేసుకుని.. ఒక పళ్లెంలో వుంచి పూర్వాభిముఖంగా కూర్చుని పూజాకార్యక్రమాలను నిర్వహించుకోవాలి.

కేవలం పంచ ఉపచార పూజ... అంటే దేవతల పేర్లయిన గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేధ్యం సమర్పయామి అని చెప్పి ఐదునిముషాలలోనే పూజను ముగించుకోవచ్చు.

RESULTS OF LORD MAHADEV'S ABHISHEKAMU - TELUGU SPIRITUAL ARTICLES


శివునిని అభిషేకించడం వల్ల కలిగే ఫలితాలేంటి? 

శివునిని భక్తిశ్రద్ధులతో ప్రతిఒక్కరు ఎంతో ఆరాధంగా పూజిస్తారు. ఆయనను అభిషేకించడానికి రకరకాల పదార్థాలను, ద్రవపదార్థాలను ఉపయోగిస్తారు. పూర్వం నుంచి మన హిందూ సంప్రదాయంలో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని పాటించడం వల్ల పూర్వపాపాలు అన్ని తొలగిపోయి, మంచి లాభాలను పొందుతారని పండితులు, జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. 

అంతేకాదు... ఏయే పదార్థాలతో శివునికి అభిషేకం చేస్తే.. ఆయా పదార్థాలకు సంబంధించిన మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అవేమిటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం....

01. నువ్వుల నూనెతో శివుడిని అభిషేకిస్తే... అపమృత్యువు నశిస్తుంది.

02. ఆవుపాలతో శివునిని అభిషేకం చేయడం వల్ల కష్టాలు తొలగిపోయి, సర్వసౌఖ్యాలు ప్రసాదించబడుతాయి.

03. గరిక నీటితో శివునికి అభిషేకం చేయడం వల్ల... నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతారు.

04. మెత్తని చెక్కరతో శివునికి అభిషేకం చేయడం వల్ల జీవితంలో వున్న దు:ఖాలు నాశనం అయి, సంతోష జీవన విధానాన్ని పొందుతారు.

05. చెరకు రసంతో శివునికి అభిషేకించడం వల్ల.. ధనవ్యవహారాలలో వున్న సమస్యలు ఒక్కసారిగి తొలగిపోయి... ధనవృద్ది కలుగుతుంది.

06. ఆవు నేయితో శివునిని అభిషేకిస్తే.. నష్టాలన్నీ తొలగిపోయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

07. నిత్యం పెరుగుతో శివునిని అభిషేకిస్తే.. మంచి ఆరోగ్యంతోపాటు బలం, యశస్సు లభిస్తుందని శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు.

WHY KOLAM ARE NOT DECORATED ON NEW MOON NIGHT


అమావాస్యరోజు ముగ్గులు ఎందుకు వేయకూడదు?

సాధారణంగా మహిళలు ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుంటారు. ఆ తరువాత నీటిని చల్లుకుని, ముగ్గులు వేసి అందంగా అలంకరించుకుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. అయితే అమావాస్య తిథి రోజునాడు ఇంటిముందు ముగ్గులు వేయకూడదని పండితులు బల్లగుద్దిమరీ హెచ్చరిస్తున్నారు. 

అమావాస్యకు ముందురోజు పితృదేవతలు మన గృహానికి వస్తారని చెబుతున్నారు. ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే.. వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు పేర్కొంటున్నారు. ఆరోజు ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుని, నీటిని చల్లుకోవచ్చు కానీ ముగ్గులు వేయకూడదని వారు చెబుతున్నారు.

ఒకవేళ ముగ్గులు వేస్తే.. పితృదేవతలు ఇంట్లోకి రాకుండా వాకిలితోనే ఆగిపోతారని పండితులు పేర్కొంటున్నారు. అందువల్ల అమావాస్యరోజు పితృదేవతలను మనసారా ప్రార్థించి, దేవతామూర్తులకు నైవేద్యాలు, కర్పూరహారాలు ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.

పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైన అమావాస్యనాడు.. దేవతలను స్మరించినా ఫలితం వుండదంటున్నారు పండితులు. ఆరోజు దేవతలకు సమానంగా పితృదేవతలను కూడా కొలిస్తే.. సకల సంపదలు చేకూరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.

MARRIAGE GIVES RESPONSIBILITY


Related Posts Plugin for WordPress, Blogger...

chitika

Labels

Cartoons Collection (401) Childrens Facts (170) Childrens Comics - Telugu (168) Kids Health Tips (144) God Photos (123) Childrens Quotes (102) Childrens Jokes (99) Childrens Pdf Ebooks (85) Chandamama Telugu Comics PDF Ebooks (84) Childrens Art and Paintings (66) Telugu General Knowledge (65) Telugu Devotional Kids Articles (60) Childrens Rhymes English (55) Funny Pics and Photos (50) PICS AND PHOTOS (47) English Childrens Comics (46) Childrens Healthy Recipes - Telugu (45) Muggulu / Rangoli / Kolam / Rangavalli designs and models (39) Birds Information (36) Childrens General Items (35) Kids Moral Stories - Telugu (35) Childrens Poems - English (33) Childrens General Tips (30) Telugu Life Quotes and Quotations (28) Childrens Fashion Dresses (26) Global Fashion (26) Telugu Sukthulu - Telugu Quotes (24) English Comics Pdf Ebooks (23) Images and Pics (23) Mom Stories (20) Bala Kavithalu - Telugu Kids Poetry (19) Wishes and Greetings (19) Childrens Drawing (18) Kids Bed Room Decoration (17) Moral Comics for Kids (17) God's Prayers (15) Picnic Spots and Tourism (15) Great Indian Personalities (14) Beauty Tips (13) Children Fashion Accessories (13) Festival Greetings (13) General Knowledge English (13) Childrens Poems - Telugu (12) Kids English Poetry (12) Telugu Poetry (12) Childrens Songs in Telugu (10) Dasara Festival Articles (10) Swami Vivekananda Quotes in Telugu (10) Childrens Birthday Cakes Photos (9) Funny Words (9) Indian Marriage Traditions and Culture (9) Amazing Nature Pics and Images (8) Animals (8) Ancient Indian Historic Stories (7) Animations and GIFs Photos and Pics (7) Golden Jewellary and Ornaments (7) Hindi Childrens Rhymes (7) Bikes Collection (6) CHILDRENS CARE TIPS (6) Temples Information (6) Vinayaka Chavithi Festival Articles and Stories (6) World Great Battles (6) World Great Personalities (6) ANCIENT CULTURE (5) Alphabets - Telugu (5) Ancient Indian Spiritual Articles (5) Computer Articles (5) Indian Cinema (5) Indian Mythological Stories (5) Musical Instruments (5) Puzzle Games (5) Telugu Samethalu - Telugu Quotes (5) Telugu Spiritual Articles (5) Vemana Poems Collection (5) Wedding Cakes Designs and Models (5) Yoga Tips (5) Akbar Birbal Stories (4) Amazing Facts (4) Bapu Cartoons and Jokes Collection (4) Childrens Educational Poems (4) Childrens Photos (4) Childrens Tips (4) Freedom Fighters of India (4) General Tips and Ideas (4) Ginger health tips (4) Girls Jewellery Boxes (4) Good Words (4) Kids Tricks (4) Little Wonders of the World (4) Lord Hanuman Pics and Photos (4) Our Festivals (4) Photo Comments (4) Science and Technology (4) Wallpapers (4) Childrens Eye Care Tips (3) Childrens Poems - HIndi (3) Experiments and Magic (3) Fables Collection (3) Flowers Pics and Photos (3) Fruit Tips (3) Graphic Images (3) Kids Indian Ancient Beliefs (3) Kids Kitchen and Decoration Ideas (3) Kitchen Accessories (3) Lord Vigneswara Prayers (3) Mehandi and Mehandi Designs (3) Podupu Kathalu (3) Pregnant Women Health Benefits and Tips (3) Purana Slokas - Poems Meaning (3) Sea Animals (3) Swami Vivekananda Quotes in English (3) Tea Pots and Tea Cups Models and Designs (3) Telugu Classic Cinema (3) Telugu Grammer (3) Tongue Twitters (3) World History (3) ANCIENT WOMEN (2) Arts and Crafts (2) Body Fitness (2) Cancer Health Tips (2) Chandamama English Stories (2) Children Dental Care Tips (2) Children Hair Styles (2) Childrens Comics Mini Novels (2) Childrens Games (2) Coins Collection (2) English Poems (2) Female Kids Ornaments (2) Flash Games (2) General Ayurveda Health Tips (2) General Research Articles (2) Gifts Articles Collection (2) Hair Care Tips (2) Hindi Cartoons (2) Hindi Kids Short Stories (2) Hindi Poetry (2) Learning Skills (2) Lord Ayyappa Swamy Prayers and Articles (2) Lord Shirdhi Sai Baba Prayers (2) Lord Siva Prayers (2) Moral Teachings (2) Mulla Nasiruddin Classic Stories (2) Pattu Sarees Collection (2) Pooja and Prayers (2) Sleeping Tips (2) Sravana Masam Festival Telugu Articles (2) Strawberry Sofas Designs and Models for Kids (2) Telugu Patriotic Songs (2) Varalakshmi Vratham Festival Articles (2) Vegetables Health Tips in Telugu (2) Women Kitchen Tips (2) World Famous Scientists (2) Apsarasalu - Angel Beauties (1) Banana Tips (1) Blood Pressure Health Tips (1) Breakfast Tips (1) CART (1) CARTOONS (1) Cartoons in English (1) Celebrities Autographs (1) Champak (1) Chandamama English Pdf Ebooks (1) Checkerboard Birthday Cakes (1) Childrens Classic Telugu Comics Ebooks (1) Cities and Countries (1) Coconut Benefits and Tips (1) Computers and Mobiles (1) Cricket News (1) Daily Good Words (1) Dancing Tips (1) Dasaradhi Satakam (1) English Abbrevations (1) English Heart Touching Poetry (1) Eye Beauty tips (1) FREE (1) FUN (1) Female Accessories (1) Furniture and Fixtures (1) GE (1) GREE (1) Gadgets and Android Apps (1) General Messages (1) HEAL (1) HEALTH (1) Handmade Rangoli designs (1) Hindi Comics Stories (1) Hindi Kids Lullabies - Lolly Songs (1) Hindi Patriotic Songs (1) Hindi Quotes and Quotations (1) Hindi Tongue Twisters (1) Hindu Dharmas (1) Honey Health Benefits and Tips (1) Indian Freedom Fighters (1) Indian Historic Personalities (1) Joint and Back Pain Health Tips (1) Kids Colouring Ebooks (1) Kids Photos (1) Kids Toys (1) Lips Beauty Tips (1) Maps of India (1) Neck Pain Tips (1) PHO (1) Patterned Paint Roller Models (1) Politikal Kartoons (1) Srikrishna Janmastami Festival Articles (1) Stress Relief tips (1) Summer Travel (1) Summer cool tips (1) Superman Birthday Cakes (1) Swimming Health Tips (1) Teenage Fashion (1) Telugu Poojalu (1) Tenali Rama Stories (1) Travel Guide - Telugu (1) Vegetable Names (1) Winter Tips (1) World Great Structures - Constructions (1) compu (1)

chitika

My Blog List