chitika

Search This Blog

chitika

chitika

Thursday, July 31, 2014

Telugu Article about amazing 7 wonders of Puri Jagannath Temple


7 wonders of Puri Jagannath Temple 

పూరి జగన్నాథుని ఆలయం గురించి ఏడు అద్భుతమైన విషయాలు

1) ఆలయంపై జెండా ఎప్పుడు గాలికి"Opposite direction" లో ఉంటుంది.

2) ఆలయంపై ఉండే సుదర్శన చక్రాన్ని మనం పూరి పట్టణం లో ఎక్కడ ఉన్నా మనవైపు చూస్తునట్టే కనిపిస్తుంది.

3) మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది మరియు సంధ్యా వేళలో దానికి వ్యతిరేకంగా ఉంటుంది. కానీ పూరి పట్టణంలో మాత్రం దానికి విరుద్ధంగా ఉంటుంది.

4) పక్షులు గానీ, విమానాలు గానీ ఆలయం మీద వెళ్ళవు.

5) గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా, ఏ దిశలో అయినా అస్సలు కనిపించదు.

6) ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలనే ఉంటుంది. దానిని దాదాపు 20 లక్షలు మందికి పెట్టవచ్చు. అయినా అది వృధా అవ్వదు, తక్కువ అవ్వదు !

7) జగన్నాథుని ఆలయంలోని వంటశాలలోచక్కల నిప్పు మీద 7 మట్టిపాత్రలను ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. అయినా ముందు పైన ఉండే మట్టిపాత్ర వేడి అవుతుంది, చివరిగా క్రింద ఉండేదివేడి అవుతుంది. ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేయగానే సముద్రం శబ్దం వినపడదు, అదే ఒక అడుగు వెనక్కి వేస్తే శబ్దం వినిపిస్తుంది.

HD PIC OF LORD SHREE SHIRDHI SAI BABA


WORLD GREAT TELUGU PERSONALITIES - THE GREAT BHADRACHALA BHAKTHA RAMADASU CHARITRA IN TELUGUద్రాచల రామదాసు

భక్తరామదాసు అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ' అని చూపిస్తూ భద్రాచల వైభవాన్ని, సౌందర్యాన్ని వేనోళ్ళ పొగడుతూ అక్కడ రామచంద్రమూర్తి లక్షణునితో కూడి స్వర్ణప్రాకారాలతో గోపురాలతో విలసిల్లే దేవాలయంలో కొలువై భూలోక వైకుంఠంగా భద్రగిరిని శోభింపజేస్తున్నాడని, అక్కడ వెల్లువలై ప్రవహించే పవిత్రమైన గౌతమిలో స్నానంచేసి శ్రీరాముని కళ్లారా చూసి తరించమంటూ, స్థావర జంగమ రూపాలతో మన కళ్ళకు కనిపించేదంతా రామమయం అని, అంతరంగంలో ఆత్మారాముడు అనంతరూపుడై వింతలు సలుపుతున్నాడు అని, భద్రాచలంలో నెలకొన్న శ్రీరామచంద్రుని సృష్టిలో అంతటా చూచి, ఆ మహాత్ముని కొనియాడి, తరించడమే ముక్తిమార్గమని బోధించే 'అంతా రామమయం బీజగమంతా రామమయం ' అనే కీర్తనలు వినని వారుండరు. తెలుగునాట కేవలం సంగీత జ్ఞానంలేని వారుకూడా ఆబాల గోపాలం 'ఎనగాను రామభజన కన్న మిక్కిలి ఉన్నదా', 'తారక మంత్రము కోరిన దొరికెను ', 'ఏ తీరుగ నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామ ', 'ఇక్ష్వొకుకులతిలక ఇకనైన పలుకవే ', 'నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ', 'పలుకే బంగారమాయెనా కోదండపాణి మొదలైన కీర్తనలు ఆనంద పరవశంతో శ్రావ్యంగా పాడుకుంటారు. దాసరలు అనేవారు ప్రత్యేకంగా వీటిని పాడుతూ భజనలు చేసుకుంటూ దేశాటనం చేస్తారు.రామనామ భక్తిరసం పొంగిపొరలే ఈ కీర్తనలను రచించిన భక్తశిఖామణి వాగ్గ్తేయ కారకుడు రామదాసు. ఇతడే భద్రాచల రామదాసు. భద్రాద్రి రామదాసు గోపరాజు.

రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న 1620 ప్రాంతంలో తెలంగాణాలో నేలకొండపల్లి అనే గ్రామంలో జన్మించాడని నిర్ణయింపబడింది. గోపన్న తండ్రి లింగనమంత్రి. తల్లి కామాంబ. ఈ పుణ్యదంపతులకు రామానుగ్రహంవల్ల పుట్టిన ఏకైక పుత్రుడే గోపన్న. గోపన్న చిన్ననాటినుంచీ రామభక్తుడే. బాలరామాయణం మొదలగు గ్రంధాలను పఠించేవాడు. ఇతని ఇంట్లో ఎప్పుడూ భజన గోష్ఠులూ, భాగవత సత్కారాలు జరుగుతూండేవి. రఘునాధ భట్టాచార్యులనేవారు గోపన్న తాను రచించిన దాశరధీ శతకంలో చెప్పుకున్నాడు.

ఉత్తర హిందూస్థానంలో గొప్ప భక్తుడుగా వేదాంత కీర్తన రచయితగా ప్రసిద్ధి పొందిన కబీరుదాసు ఈ గ్రామానికి వచ్చినప్పుడు గోపన్నకు రామమంత్రం ఉపదేశించాడు. అప్పుడే గోపన్న 'తారకమంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా అనే కీర్తనను రచించాడు. గోపన్నకు వివాహమయింది. తల్లిదండ్రులు మరణించారు. కొంత కాలానికి ఒక పుత్రుడు పుట్టాడు. ఒకనాడు సంతర్పణ చేస్తుండగా ప్రమాద వశాత్తు గంజిగుంటలో మరణించిన కుమారుని రామసంకీర్తనంద్వారా బ్రతికించుకున్నాడు.

రామదాసు భక్తిమార్గంలో మునిగిపోయి ఉన్న డబ్బు, ఆస్థి హరిదాసులకు ఇచ్చి కట్టు బట్టలతో అష్టకష్టాలు అనుభవిస్తూ జీవిస్తూండేవాడు. సంసారపోషణ జరగడమే కష్టంగా ఉండేది. అప్పుడు ఇతడు గోల్కొండ రాజధాని అయిన హైదరాబాదు చేరుకున్నాడు. అక్కడ తన మేనమామలు అక్కన్న, మాదన్నలు గోల్కొండను పరిపాలించే కుతుబ్‌షా వంశస్థులైన అబ్దుల్లా, అబుల్‌హసన్ తానాషాలకు మంత్రులుగా ఉండేవారు. వారు అతనికి భద్రాచలానికి తహశీలుదారుగా ఉద్యోగం వేయించారు. రామదాసుకి స్వప్నంలో శ్రీరాముడు కనిపించి భద్రాచలంలో తన ఆలయాన్ని కట్టించి ప్రతిష్ఠ చేయించమని ఆనతిచ్చి అదృశ్యమైనాడు.

తహశీలుదారుగా ఉంటున్న రామదాసు అక్కడ ప్రజల ఆదరాభిమానాలను సంపాదించి పన్నులు వసూలుచేసి ఆ డబ్బుతో భద్రాచల రాముడికి కైంకర్యం చేస్తూండేవాడు. ఈ విధంగా వసూలు చేసిన పన్నులు ప్రభుత్వం ఖజానాకు రాకపోగా తానాషా శిస్తు పైకం చెల్లించమని రామదాసుకి కబురు పంపాడు. రామదాసు ఆ పైకాన్ని చెల్లించలేకపోగా ప్రభుత్వం సొమ్ము అపహరించారనే నేరంమీద రామదాసుని చెరసాలలో పెట్టి 12 సంవత్సరాలు నానాబాధలు పెట్టాడు. చెరసాలలో భక్త్యావేశంతోను దుఃఖావేశంతోను చెప్పిన కీర్తనలే రామదాసు కీర్తనలు. చెరసాలలో అనేక కష్టాలు అనుభవించి విసిగి ఒకరోజున విషంత్రాగి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటూండగా శ్రీరామ లక్షణులు తానాషాకు అంతఃపురంలో బంట్రోతులవేషంలో కనపడి రామదాసు పంపినట్లుగా పైకాన్ని చెల్లించారు. రసీదు తీసుకుని రామదాసును విడిపించారు.ఆ తరువాత రామదాసు తానాషా సమ్మతితో భద్రాచలంలో రాములవారికి కైంకర్యాలుచేస్తూ పరమభక్తుడుగా ప్రసిద్ధిని పొందాడు. సహజభక్తి భావావేశంతో తన్మయత్వంతో అప్రయత్నంగా కీర్తనలను రచించడమేకాకుండా 'దాశరధీ కరుణాపయోనిదీ అనే మకుటంతో దాశరదీ శతకాన్ని కూడా రచించాడు.

రామభక్తి కారణంగా గోపన్నకి రామదాసు అనే పేరు స్థిరపడిపోయింది. ఆంద్రదేశంలో ప్రసిద్ధిపొందిన మహాభక్తులు పోతరాజు, గోపరాజు, త్యాగరాజు. పోతన ముముక్షువు, మహాయోగి. సహజ పాండిత్యుడు. వ్యవహార భాషను కావ్యంలో ఇష్టపూర్తిగా ఉపయోగించి రామభక్తిని ప్రదర్శించిన మహాకవి. త్యాగరాజు మహాపురుషుడు, గొప్ప పండితుడు మహా సంగీతవేత్త, భక్తుడు. ఇతడు నాదసుధారసమైన రామభక్తికి అమరత్వాన్ని కల్పించి త్యాగోపనిషత్తు ఆనదగిన కృతి రాజములను రచించాడు. ప్రహ్లాద, పరాకర, నారద, పుండరీకాదులతో సమానుడని రామదాసుని త్యాగరాజు కీర్తించి భాగవత శిఖామణి రామదాసుని యందు భక్తిని ప్రదర్శించాడు.

గోపరాజు సంగీతాన్ని, సాహిత్యాన్ని సరసంగా మేళవించి రామభక్తి బీజాలను దేశంలో నలుమూలలా వెదజల్లాడు. శ్రీరామ చంద్రునికి తెలుగుతనం కల్పించిన భక్తశిఖామణి రామదాసు. శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, సీతమ్మని మనలోనివారిగా రూపొందించి, భక్తిమార్గంలో జ్ఞానమార్గాన్ని కూడా అవలంబిస్తూ వైరాగ్యాన్ని సిద్ధింపజేసుకున్న మహాయోగి రామదాసు.

LORD SRI SAI BABA PUJA HARATHI PIC


EDUCATION IS THE BEST FRIEND - CHANAKYA


education is the best friend.
an educated person is respected everywhere.
education beats the beauty and the youth.Kada bangles COLLECTION


READ BHAGAWADH GITA


Jai Sri Seeta sanstha ramachandra Swamy ki jai


IF WE BOTH EXCHANGE ONE GOOD THOUGHT, WE EACH HAVE TWO GOOD THOUGHTS - SWAMI VIVEKANANDA


TELUGU POOJALU AND PUNASKARALU - MANGALA GOURI VRATHA PUJA VIDHANAMU


మంగళ గౌరీవ్రతవిధానం

శ్రావణమాసం అనగానే వివాహితలకు చెప్పలేని హడావుడి. అందులో కొత్తగా పెళ్లైన ఆడవారికి మరీను! ఈ మాసంలో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే. అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి. ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు.

పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు.

పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా ... పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .

మొదట శౌనకాది మహర్షులకు మంగళగౌరీ మహాత్యాన్ని సూతులవారు వివరించారు .

నారదమహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ప్పదేశించారు ,
శ్రీకృష్ణుడు వ్రత విధాన్ని , వ్రత మహాత్యాన్ని ద్రౌపది కి వివరించాడు .

ఇక్కడ శ్రీ్కృ ష్ణులు వారు ద్రౌపది కి భోదించిం కదావిధానము ఈ విధం గా ఉన్నది....
ఒకప్పుడు త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించారు . అందువల్లనే విజయాన్ని అందుకోగలిగేరు .

మంగళ గౌరీని పూజించడము వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు .
మనువంశానికి చెందిన " మండు " డనే మహారాజు గౌరీదేవి వ్రతప్రభావము తో చాలాకాలము భూలోకం లో సర్వసంపదలతో రాజ్యము ఏలసాగేడు .


"ఓ ! ద్రపదీ ! గౌరీదేవిని పూజించి , వైధవ్యాన్ని తొలగించుకున్న ఓ అద్రుస్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను " అంటూ శ్రీ కృష్ణులు వారు ఇలా చెప్పసాగేరు .

వ్రత కథ :

చాలాకాలము క్రితము జయపాలుడనే రాజు మహిష్మతీ నగరాన్ని పాలించేవాడు . భోగభాగ్యాలు ఎన్ని ఉంటే నేం ఆయనకు సంతానము కలుగలేదు . ఆ దంపతులకు అదే దిగులు .. ఎన్ని నోకులు నోచినా , ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యము .. చివరికి పరమేస్వరునికి ఆ మహారాజు దంపతుల పై కరుణ కలిగినది ... పరమశ్వరుడు ఓ సన్యాసి రూపములో జయపాలుని నగరానికి వచ్చి అంత:పురము బయట ద్వారము వద్ద నిలబడి " భవతీ భిక్షాందేహి " అనేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు . జయపాలుి భార్య పెం లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి వెళ్లిపోయాడు . ఇలా మూడు రోజులు జరిగింది . జరిగినదంతా భర్తకు వివరించింది . రేపు ఆ సన్యాసి వచ్చేముందే నీవు సిద్ధం గా ఉండమని భర్ర్యతో చెప్పాడా రాజు .

మరుసటిరోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళెంతో సహా భ్క్ష వేయబోవడం జరిగింది . ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక ... సంతానము లేని నీచేతిభిక్ష నేను స్వీకరించనని పలికేసరికి ... అయితే మహాత్మా ! సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశైంచండి " అని వేడుకోగా .. ఆ సన్యాసి రూపము లో ఉన్న ఈశ్వరుడు " అమ్మా నేను చెప్పబోయేది నీ భర్త కు తెలియజేయి . నీల వస్త్రాలను ధరించి , నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి , ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను . అక్కడ అరణ్యం లో అతని నీలాశ్వం ఎక్కడ అలసట తో క్రిందపడుతుందో అక్కడ దిగి త్రవ్వమను . ఆ త్రవ్వకము నుండి ఒక స్వర్ణదేవాలయం బయట పడుతుంది . ఆ స్వర్ణదేవాలయం లో ఉండె అమ్మవారిని శ్రద్ధా భక్తులతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది ". అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపియైన శివుడు . ఈ విషయంతా భర్తకు చెప్పి ఆవిధంగా చేయసాగేరు . స్వర్ణదేవాలయం లో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్ధించాడు . జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు . నాకు ధనము వద్దు సంతానము కావాలని అన్నాడు జయపాలుడు .. అప్పుడు అమ్మవారు " వైధవ్యము గల కన్య కావలెనా? దీర్ఘాయుష్మంతుడు , సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు " . అప్పుడు రాజు పిత్రుదేవతల్ను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు . అప్పుడాదేవి ఆ రాజుని ' తన పార్శమున ఉన్న గణపతినాభియందడుగు వైచి , చెంతనే ఉన్న చూతవృక్షఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమయ్యెను . జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీకోసేసరికి గణపతికి కోపము వచ్చింది . " ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పహారవ ఏట సర్పం బారినపడి మరణిస్తాడని " శపిస్తాడు .

ఈ విందంబుగా కొన్నాళ్ళకు జయపాలుని భార్య ఒక కుమారుని కన్నది . ఆ కుర్రవాడికి వయసొచ్చింది . వివాహము జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహము చేద్దాం అని భర్త తో అన్నది . కాశీవిశ్వెశ్వరుడుని దర్శించి వచ్చాక వివాహము చేదాం అని చెప్పి తన కుమారుని అతని మేనమామ తో కాశీకి పంపించారు . త్రోవలో వారు పతిస్టానపురం చేరారు . అక్కడ వారిద్దరూ ఓ సత్రం లోకి ప్రవేశించారు . అక్కడ కొందరు కన్యలు ఆడుకొంటున్నారు . వరిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను " ముండ , రండ " అంటూ కోపం తో దుర్భాషలాడింది . అప్పుడు సుశీల " మా అమ్మగారు మంగళగౌరీ వ్రతము చేస్తుంది " కాబట్టి మాకుటుంబము లో ఎవరూ ముండలు , రండలు - ఉండరు అంది కోపం తో . జయపాలుడు కుమారుడు -శివుడు అంతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు . తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు . " మా ఇంట్లో ముండలు , రండలు ఎవరు ఉండరు . మా అమ్మ శ్రావణ మంగళ గౌరీవ్రతం చేస్తుంటుంది ." అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయము తోస్తుంది . సుశీలను శివుడి కిచ్చి వివాహము జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు . మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ..ధ్యానము లో ఉన్న సుశీల తల్లిదండ్రుల దగ్గరగా చేరి శివుడనే బాలుడు నీకూతురు కి తగిన భర్త అని దేవుని వాక్యము గా చాటుగా అంటాడు . దాంతో సుశీల .. శివుడు ల వివాహము జరిగిఫోతుంది .


పెళ్ళయిన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు . మంగళగౌరీదేవి ముత్తైదువు రూపములో సుశీలకు కలలో కనబడి " నీ భర్త అల్ఫాయుష్కుడు ఈ రాత్రి తో ఆతని ఆయువు చెల్లింది . ఈ దోషమునకు మార్గము చెపుతాను విను " అని ఈవిధంగా చెప్పెను .

" కొద్ది సేపట్లో ఒక కృష్న సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది . వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు ... అప్పుడ పాము ఆ ఘటం లోకి పవేశించాక వస్త్రము తో ఆకుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు ". దాంతో నీ భర్తకా గండము తప్పిపోతుంది " అని అంతర్ధానమయ్యెను . శివుడు తన మేనమామతో కాశీ యాత్ర పూర్తిచేసుకొని తిరుగు ప్రయాణములొ భార్య సుశీలను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు . విషయము తెలుసుకొందామని శివుడు .. సుశీలను తన ఆయువు ఎలా? పెరిగినదని అడుగగ " అంతా శ్రావణ మంగళ గౌరీ్వ్రతం ప్రభావమని చెప్పినది . ఈ విదముగా శ్రికృష్నుడు ఈ కథను ద్రౌపది కి చెప్పెను .

పూజావిధానం 

ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా....ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశయామి, పూజార్ధం

పునరాగమనాయచః..... అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్లి, మళ్లీ పూజకి మమ్మల్ని అను గ్రహించు అని అర్ధం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణం అవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్యదాంపత్యం కోసం 'మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు .
Monday, July 21, 2014

HD PIC OF LORD RADHA KRISHNA - THE DIVINE LOVERS


NO CHANCE TO BE HERE


SRI VINAYAKA GANAPATHI STHOTRALU - LORD VIGNESWARA PRAYERS


శ్రీ వినాయక గణపతి స్తోత్రాలు

వారణాస్యో దరఘో ర్త్య ఏకదంత శ్శివాత్మజ:
సుశర్మ కృత్తారకో ర్చ్య: కవిస్తత్పురుషప్రియ: ||

సుముఖ ప్రథమ స్వనామగాయకపాలక సేవకమంగలకారక
కామసుపూరక మంగలకారక, త్రాహి వినాయక భావికతారక ||

నమో గణపతయే తుభ్యం జ్యేష్ట జ్యేష్టాయ తే నమ:
స్మరణాద్యస్య తే విఘ్నాన తిష్టంతి కదాచన ||

ద్విరదానన విఘ్నకాననజలన త్వం ప్రథమేశనందన
మదనపతిమాఖువాహన జ్వలనాభాసితపింగలోచన ||

గణాదీశో దీశో హరిహరవిదీశో భయకరో 
గుణాదీశో దీశో విజయత ఉమాహృత్సుఖకర:
బుదాదీశో నీశో నిజభాజకవిఘ్నౌఘహరకో
ముదాదీశో పీశో యశస ఉభాయద్దేశ్చ శరణం||

LORD GANESHA DECORATED IN A MANDAPAM


SRI KRISHNA SATAKAM - LORD SRI KRISHNA PRAYER


LORD SRI PANCHAMUKHA GANESHA STATUE


Telangana Bonalu Festival Art Painting


Anemone Chair by Giancarlo Zema

NO RAKHI WITH BHAMAA


OM NAMAH SIVAYA TELUGU DEVOTIONAL PRAYER
ఓం నమో నమో నమఃశివాయ !
మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయా
గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయా
ఓం నమో నమో నమఃశివాయ !!
శూరినే నమో నమః కపాలినే నమః శివాయా
పాలినే విరంచితుండ మాలినే నమః శివాయా .

RAJASTHANI PRINCESS PAINTING


Friday, July 18, 2014

SRI DASARADHI SATAKAM TELUGU POEMS AND ITS MEANING - LORD SRI RAMA'S PRAYERS IN TELUGUదాశరథీ శతకం -- రామదాసు. 

దోరసిన కాయముల్మిదిని తొచినచూచి ప్రభుత్యముల్సిరు 
ల్మెరపులుగాగ జూచిమరి మేదినిలో తమతోడి వారు ముం
దరుగుటజూచి జూచి తెగునాయు వెరుంగక మోహపాశము 
ల్దరుగనివారు కేమి గతి ! దాశరథీ కరుణాపయోనిధీ !

భావము :

దశరధ పుత్రా, కరుణా సముద్రా రామా ! శరీరమునకు ముసలితనము వచ్చిన తోడనే ప్రభుత్వము. సంపదలు, మొదలగునవి మెరుపులవలె భావించి, తోటివారు తనకన్నా ముందుగా మరిణించుట చూచుచు. కుడా, చావు ఎప్పుడు అలా వచ్చునో తెలుసుకోనలేక మోహము కోరికలు త్రెంచుకోలేక సంచరించు వారి గతి ఏమో ఎవరికీ తెలియదు.
ఇక్కడ భక్త కవి ప్రభుత్వము అన్న మాట వాడాడు. ఆకాలమున ప్రభులేకాని ప్రభుత్వాలున్నవా ? ఆశా వ్యమోహములు వదులుకోలేక కొట్టుమిట్టాడు తున్న వారిన చూచి చెప్పుచున్నాడు

BRIEF HISTORY OF LORD SRI VENKATESWARA SWAMY AT TIRUPATI


శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు విగ్రహం
ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది.
తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది.

తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు.మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.

అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.

ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు

VILLAGE MUMMY PAINTING


DELICIOUS TAPEESWARAM KAZA


తాపేశ్వరం కాజా

ALWAYS THE BEST


SOMETIMES YOU HAVE TO DO WHAT'S BEST
FOR YOU AND YOUR LIFE,
NOT WHAT'S BEST FOR EVERYBODY ELSE

MY LOVELY HOME AND GARDEN PAINTING


PURE DESI INDIAN BEAUTY - BACK GROUND TAJ MAHAL - PAINTING


saakambarigaa warangal bhadrakali matha


saakambarigaa warangal bhadrakali

TIPS TO PERFORM SRAVANA MASAM SRI LAKSHMI PUJA IN TELUGU
KUCHELA WITH LORD KRISHNA PAINTING


BEAUTIFUL WOMEN PAINTING


Related Posts Plugin for WordPress, Blogger...

chitika

Labels

Cartoons Collection (401) Childrens Facts (170) Childrens Comics - Telugu (168) Kids Health Tips (144) God Photos (123) Childrens Quotes (102) Childrens Jokes (99) Childrens Pdf Ebooks (85) Chandamama Telugu Comics PDF Ebooks (84) Childrens Art and Paintings (66) Telugu General Knowledge (65) Telugu Devotional Kids Articles (60) Childrens Rhymes English (55) Funny Pics and Photos (50) PICS AND PHOTOS (47) English Childrens Comics (46) Childrens Healthy Recipes - Telugu (45) Muggulu / Rangoli / Kolam / Rangavalli designs and models (39) Birds Information (36) Childrens General Items (35) Kids Moral Stories - Telugu (35) Childrens Poems - English (33) Childrens General Tips (30) Telugu Life Quotes and Quotations (28) Childrens Fashion Dresses (26) Global Fashion (26) Telugu Sukthulu - Telugu Quotes (24) English Comics Pdf Ebooks (23) Images and Pics (23) Mom Stories (20) Bala Kavithalu - Telugu Kids Poetry (19) Wishes and Greetings (19) Childrens Drawing (18) Kids Bed Room Decoration (17) Moral Comics for Kids (17) God's Prayers (15) Picnic Spots and Tourism (15) Great Indian Personalities (14) Beauty Tips (13) Children Fashion Accessories (13) Festival Greetings (13) General Knowledge English (13) Childrens Poems - Telugu (12) Kids English Poetry (12) Telugu Poetry (12) Childrens Songs in Telugu (10) Dasara Festival Articles (10) Swami Vivekananda Quotes in Telugu (10) Childrens Birthday Cakes Photos (9) Funny Words (9) Indian Marriage Traditions and Culture (9) Amazing Nature Pics and Images (8) Animals (8) Ancient Indian Historic Stories (7) Animations and GIFs Photos and Pics (7) Golden Jewellary and Ornaments (7) Hindi Childrens Rhymes (7) Bikes Collection (6) CHILDRENS CARE TIPS (6) Temples Information (6) Vinayaka Chavithi Festival Articles and Stories (6) World Great Battles (6) World Great Personalities (6) ANCIENT CULTURE (5) Alphabets - Telugu (5) Ancient Indian Spiritual Articles (5) Computer Articles (5) Indian Cinema (5) Indian Mythological Stories (5) Musical Instruments (5) Puzzle Games (5) Telugu Samethalu - Telugu Quotes (5) Telugu Spiritual Articles (5) Vemana Poems Collection (5) Wedding Cakes Designs and Models (5) Yoga Tips (5) Akbar Birbal Stories (4) Amazing Facts (4) Bapu Cartoons and Jokes Collection (4) Childrens Educational Poems (4) Childrens Photos (4) Childrens Tips (4) Freedom Fighters of India (4) General Tips and Ideas (4) Ginger health tips (4) Girls Jewellery Boxes (4) Good Words (4) Kids Tricks (4) Little Wonders of the World (4) Lord Hanuman Pics and Photos (4) Our Festivals (4) Photo Comments (4) Science and Technology (4) Wallpapers (4) Childrens Eye Care Tips (3) Childrens Poems - HIndi (3) Experiments and Magic (3) Fables Collection (3) Flowers Pics and Photos (3) Fruit Tips (3) Graphic Images (3) Kids Indian Ancient Beliefs (3) Kids Kitchen and Decoration Ideas (3) Kitchen Accessories (3) Lord Vigneswara Prayers (3) Mehandi and Mehandi Designs (3) Podupu Kathalu (3) Pregnant Women Health Benefits and Tips (3) Purana Slokas - Poems Meaning (3) Sea Animals (3) Swami Vivekananda Quotes in English (3) Tea Pots and Tea Cups Models and Designs (3) Telugu Classic Cinema (3) Telugu Grammer (3) Tongue Twitters (3) World History (3) ANCIENT WOMEN (2) Arts and Crafts (2) Body Fitness (2) Cancer Health Tips (2) Chandamama English Stories (2) Children Dental Care Tips (2) Children Hair Styles (2) Childrens Comics Mini Novels (2) Childrens Games (2) Coins Collection (2) English Poems (2) Female Kids Ornaments (2) Flash Games (2) General Ayurveda Health Tips (2) General Research Articles (2) Gifts Articles Collection (2) Hair Care Tips (2) Hindi Cartoons (2) Hindi Kids Short Stories (2) Hindi Poetry (2) Learning Skills (2) Lord Ayyappa Swamy Prayers and Articles (2) Lord Shirdhi Sai Baba Prayers (2) Lord Siva Prayers (2) Moral Teachings (2) Mulla Nasiruddin Classic Stories (2) Pattu Sarees Collection (2) Pooja and Prayers (2) Sleeping Tips (2) Sravana Masam Festival Telugu Articles (2) Strawberry Sofas Designs and Models for Kids (2) Telugu Patriotic Songs (2) Varalakshmi Vratham Festival Articles (2) Vegetables Health Tips in Telugu (2) Women Kitchen Tips (2) World Famous Scientists (2) Apsarasalu - Angel Beauties (1) Banana Tips (1) Blood Pressure Health Tips (1) Breakfast Tips (1) CART (1) CARTOONS (1) Cartoons in English (1) Celebrities Autographs (1) Champak (1) Chandamama English Pdf Ebooks (1) Checkerboard Birthday Cakes (1) Childrens Classic Telugu Comics Ebooks (1) Cities and Countries (1) Coconut Benefits and Tips (1) Computers and Mobiles (1) Cricket News (1) Daily Good Words (1) Dancing Tips (1) Dasaradhi Satakam (1) English Abbrevations (1) English Heart Touching Poetry (1) Eye Beauty tips (1) FREE (1) FUN (1) Female Accessories (1) Furniture and Fixtures (1) GE (1) GREE (1) Gadgets and Android Apps (1) General Messages (1) HEAL (1) HEALTH (1) Handmade Rangoli designs (1) Hindi Comics Stories (1) Hindi Kids Lullabies - Lolly Songs (1) Hindi Patriotic Songs (1) Hindi Quotes and Quotations (1) Hindi Tongue Twisters (1) Hindu Dharmas (1) Honey Health Benefits and Tips (1) Indian Freedom Fighters (1) Indian Historic Personalities (1) Joint and Back Pain Health Tips (1) Kids Colouring Ebooks (1) Kids Photos (1) Kids Toys (1) Lips Beauty Tips (1) Maps of India (1) Neck Pain Tips (1) PHO (1) Patterned Paint Roller Models (1) Politikal Kartoons (1) Srikrishna Janmastami Festival Articles (1) Stress Relief tips (1) Summer Travel (1) Summer cool tips (1) Superman Birthday Cakes (1) Swimming Health Tips (1) Teenage Fashion (1) Telugu Poojalu (1) Tenali Rama Stories (1) Travel Guide - Telugu (1) Vegetable Names (1) Winter Tips (1) World Great Structures - Constructions (1) compu (1)

chitika

My Blog List